పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

Aug 5 2026 1:53 AM | Updated on Aug 5 2026 1:53 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పెండింగ్‌ ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మేడారం వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి సీతక్క ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. మిగతా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమ్మక్క భవన్‌లో ‘మదర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత టైలరింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. 45 రోజుల శిక్షణ పూర్తిచేసిన ప్రతీ అభ్యర్థికి సర్టిఫికెట్‌ అందజేస్తామని, మేడారం, పరిసర గ్రామాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రవించందర్‌, డీఈఓ సిద్దార్థరెడ్డి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సర్పంచ్‌ పీరిళ్ల భారతి పాల్గొన్నారు.

రామప్ప ఆలయ అభివృద్ధికి రూ. 61.99 కోట్లు

వెంకటాపురం(ఎం): మండలంలోని రామప్ప దేవాలయం వద్ద ప్రశాద్‌ పథకంలో భాగంగా రూ.61.99 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క.. కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి ప రిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడి గి తెలుసుకుని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూ ర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్‌ డైరెక్టర్‌ భగవాన్‌ రెడ్డి, టూరిజం డీఈ నటరాజ్‌, ఏఈ విజయ్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే, వెంకటాపూర్‌ మండలం జవహర్‌నగర్‌లో రూ.2.30 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా విద్యాలయం నూతన భవనం, అదనపు తరగతి గదులు, ప్రయోగశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ

మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement