తొర్రూరు: సాహస యువతకు సువర్ణావకాశం. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’ పేరిట జాతీయ పురస్కారాలు అందించి సత్కరించనుంది. దీనికి కోసం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సాహస పురస్కారానికి కావాల్సిన అంశాలు..
● భూమిపై చేసిన సాహస యాత్రలు
● సముద్రం, ఆకాశంలో చేసే సాహస యాత్రలు
● అభ్యర్థులు 2023, 2024, 2025 సంవత్సరాల్లో సాధించిన సాహస కృత్యాలు మాత్రమే
పరిగణనలోకి తీసుకుంటారు.
● సాహస కృత్యాల్లో పాల్గొన్న ధ్రువీకరణ పత్రాలు అధికారిక పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.
● అవార్డు గ్రహీతలకు టెన్సింగ్ నార్గే కాంస్య
విగ్రహం, ప్రశంస పత్రం, బ్లేజర్‌తో పాటు రూ.15 లక్షల నగదు బహుమతి అందిస్తారు.
పోర్టల్, దరఖాస్తు తేదీ ఇలా..
http:///awards.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆగస్టు 20 తేదీలోపు పైన తెలిపిన పోర్టల్‌లో పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయాలి.
ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేస్తే
తిరస్కరిస్తారు.
మరిన్ని వివరాలకు జిల్లా యువజన సర్వీసుల శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.
ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 20 వరకు గడువు


