● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క
కొత్తగూడ: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక బుక్ తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. వాటిని ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేస్తామని చెప్పారు. గతంలో మంజూరైన సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేస్తే కొత్తవి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోతు రూప్‌సింగ్, పదవీ విరమణ చేసిన వజ్జ సారయ్యలను శాలువాతో సత్కరించారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు మల్లెల భాగ్యమ్మ, నాయకులు ఇర్ప రాజేశ్వర్, స్కురబోయిన మొగిళి, పుల్సం పుష్పలత, కారోజు రమేష్, మల్లెల రణధీర్, చెన్నూరి మహేందర్, 23 గ్రామపంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


