సీపీఎం రాష్ట్ర నాయకుడు చంద్రారెడ్డి కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

సీపీఎం రాష్ట్ర నాయకుడు చంద్రారెడ్డి కన్నుమూత

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

నర్సంపేట మెడికల్‌ కళాశాలకు

మృతదేహం అప్పగింత

దుగ్గొండి: వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన సీపీఎం రాష్ట్ర నాయకుడు పుచ్చకాయల చంద్రారెడ్డి(95) అనారోగ్యంతో మృతి చెందారు. శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్న చంద్రారెడ్డిని కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో పొందుతూ సోమవారం మృతి చెందారు. చంద్రారెడ్డి 1954లో సీపీఐలో చేరి ఎనిమిది మందితో గ్రామశాఖను ప్రారంభించి, కొంత కాలానికి సీపీఎంలో చేరి నర్సంపేట డివిజన్‌ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బాధ్యుడిగా, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా సేవలందించారు. తన మరణం అనంతరం మృతదేహాన్ని వైద్య పరిశోధన కోసం మెడికల్‌ కళాశాలకు అందించాలని చంద్రారెడ్డి ముందే రాసుకున్న ప్రకారం.. గ్రామంలో కాసేపు ప్రజల సందర్శన అనంతరం ఆయన కుమారులు భాస్కర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, కూతురు అరుణశ్రీ, భార్య మల్లక్క.. నర్సంపేట మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సంధ్యారాణి ఆధ్వర్యంలో చంద్రారెడ్డి మృతదేహా న్ని అప్పగించారు. ఈసందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పార్టీ నేతలతో కలిసి చంద్రారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. చాలా ఏళ్లు పార్టీ అకౌంట్స్‌ను చాలా నిబ్దదతగా చూశారని గుర్తు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గొల్లపల్లి నాగయ్య, పాలడుగుల భాస్కర్‌, జిల్లా కార్యదర్శి రంగయ్య, హనుమకొండ, ములుగు జిల్లా కార్యదర్శులు గాదె ప్రభాకర్‌రెడ్డి, బీరెడ్డి సాంబశివ, జిల్లా నాయకుడు ఈసంపల్లి బాబు, మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య, కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మొగిలి, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement