● టీజీ ఎన్పీడీసీఎల్‌లో పదోన్నతులు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ కన్‌స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్‌గా కె.గౌతం రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఆపరేషన్–2 జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న గౌతం రెడ్డికి చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి కల్పించడంతో సోమవారం కార్పొరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి, ఏడీఈలు ఇంద్రసేనా రెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఆదిలాబాద్ ఎస్‌ఈగా పని చేస్తున్న శేషారావుకు చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి కల్పించి సీజీఆర్‌ఎఫ్ వరంగల్ టెక్నికల్ మెంబర్‌గా నియమించారు. కార్పొరేట్ కార్యాలయంలో ఐపీసీ ర్యాక్‌లో డీఈగా విధులు నిర్వహిస్తున్న అమర్‌నాథ్‌కు పదోన్నతి కల్పించి పర్చేజ్ అండ్ మేనేజిమెంట్ జనరల్ మేనేజర్‌గా నియమించారు. హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో టెక్నికల్ డీఈగా విధులు నిర్వహిస్తున్న దర్శన్ కుమార్‌కు పదోన్నతి కల్పించి మహబూబాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా నియమించారు. ఖమ్మంలో డీఈగా పని చేస్తున్న చిన్నబాబు రావుకు పదో న్నతి కల్పించి కార్పొరేట్ కార్యాలయం ఆపరేషన్–1 జనరల్ మేనేజర్‌గా నియమించారు. కొత్తగూడెం ఏడీఈగా పని చేస్తున్న కిరణ్‌కుమార్‌కు పదో న్నతి కల్పించి ఖమ్మం సర్కిల్ కార్యాలయంలో టె క్నికల్ డీఈగా నియమించారు. ఖమ్మం కన్‌స్ట్రక్షన్ ఏ డీఈగా పని చేస్తున్న కిరణ్ చైతన్యకు పదోన్నతి క ల్పించి ఎమ్మార్టీ, కన్‌స్ట్రక్షన్ డీఈగా నియమించారు.


