కేయూ మహిళా హాస్టల్‌లో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

కేయూ మహిళా హాస్టల్‌లో ఆందోళన

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

హాస్టల్స్‌ను, మెస్‌ను సందర్శించిన రిజిస్ట్రార్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్స్‌, మెస్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పోతన హాస్టల్‌ ఎదుట విద్యార్థినులు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కూడా పాల్గొని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం పోతన హాస్టల్‌ వద్దకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. పోతన హాస్టల్‌ వద్ద డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేదని దీంతో అపరిశుభ్రతతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హాస్టల్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రిజిస్ట్రార్‌ రామచంద్రం కలిసి మెస్‌ వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ కూడా విద్యార్థినులు తమ సమస్యలను రిజిస్ట్రార్‌కు విన్నవించారు. పరిశుభ్రంగా ఉండడంలేదని సమాయనికి టిఫిన్స్‌, భోజనం అందించడంలేదని ఆరో పించారు. హాస్టల్‌ వద్ద దుర్వాసన వెదజల్లుతుందన్నారు. కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయని తెలిపారు. అనంతరం రిజిస్ట్రార్‌ రామచంద్రం మాట్లాడుతూ.. వారంరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థినులకు హాలమీ ఇచ్చారు. ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్‌, యూనివర్సిటీ అధ్యక్షుడు చెన్నూరి సాయికుమార్‌, జస్వంత్‌, రాహుల్‌, అరుణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement