వరంగల్ స్పోర్ట్స్: బాక్సింగ్ అంటేనే ప్రత్యర్థి ముఖంపై పిడిగుద్దులతో ఊపిరాడకుండా చేయడం. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ పోరాడాదే ముష్టియుద్ధం. అందుకే బాక్సింగ్ అంటేనే భయపడుతుంటారు. అయితే, బాక్సింగ్‌లో రాణించాలంటే కండ బలం ఉంటే సరిపోదు .. అందుకు బుద్ధిబలం తోడైనప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఎలాగైనా బాక్సింగ్‌లో రాణించాలన్న ఓ యువతి లక్ష్యానికి తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తి తో డైంది. లక్ష్యాన్ని ఛేదించేందుకు కఠోర శ్రమ చేసి జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక పతకాలు సాధించింది.
ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు..
తాను సాధించిన పతకాలకు తోడు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక రికార్డు సొంతం చేసుకుంది. బాక్సింగ్‌లో నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్) పాటియాలలో శిక్షణ పూర్తి చేసుకున్న తొలి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రత్యేక రికార్డు సాధించిన హనుమకొండలోని పద్మాక్షికాలనీకి చెందిన చుక్క దివ్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
హనుమకొండ వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ కాలేజీలో పీజీ (ఎంఏ) చదువుతున్న దివ్య 2016లో బాక్సింగ్ క్రీడలో అరంగేట్రం చేసింది. హనుమకొండ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ బాక్సింగ్‌హాల్‌లో శిక్షణ తీసుకున్న దివ్య పదేళ్లలో 12 రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. 12 బంగారు పతకాలు సాధించడం ఆమె ప్రతిభ, పట్టుదలకు నిదర్శనం. పంజాబ్‌లోని పాటియాలలో 2025–26లో ఎన్‌ఐఎస్‌లో సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకుంది. దేశ వ్యాప్తంగా 54 మంది మహిళలు శిక్షణ తీసుకోగా అందులో దివ్య 6వ స్థానంలో నిలవడం విశేషం.
ఎన్‌ఐఎస్ శిక్షణ పూర్తి చేసి
తొలి క్రీడాకారిణిగా రికార్డు
ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని
వదులుకొన్న యువతి
తండ్రి స్ఫూర్తితో బాక్సింగ్‌లో రాణిస్తున్న చుక్క దివ్య


