నల్లబెల్లం పౌడర్‌ ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

నల్లబెల్లం పౌడర్‌ ముఠా గుట్టురట్టు

Aug 3 2026 1:07 AM | Updated on Aug 3 2026 1:07 AM

జనగామ : నల్లబెల్లం పౌడర్‌తో వెళ్తున్న బొలెరో వాహనాన్ని అపహరించిన ముఠా గుట్టును ఎకై ్సజ్‌ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి, భారీ మొత్తంలో నల్లబెల్లం పౌడర్‌, ఆలంను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి ఎన్‌.అంజిరెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన బి.వెంకన్న, హరికృష్ణతోపాటు మరో ముగ్గురు కలిసి దేవరకొండకు చెందిన సంపంగి విక్రమ్‌ ప్రయాణిస్తున్న మహీంద్రా బొలెరో వాహనాన్ని పటాన్‌చెరు ప్రాంతంలో ఇటీవల అపహరించారు. ఆ వాహనంలో 80 సంచుల నల్లబెల్లం పౌడర్‌ (1,590 కిలోలు), మూడు సంచుల ఆలం (120 కిలోలు) ఉంది. దేవరకొండ ప్రాంతానికి చెందిన కొందరు బెల్లం వ్యాపారులు అక్రమంగా బెల్లం పౌడర్‌ సరఫరా చేస్తున్నారని ముందుగా తెలుసుకున్న నిందితులు.. వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని యత్నించినట్లు విచారణలో తేలింది. వ్యాపారులు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో సరుకును తమ ఆధీనంలోకి తీసుకుని విక్రయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ కొత్తపేట ప్రాంతంలో 27 సంచుల నల్లబెల్లం పౌడర్‌ను దించి మిగిలిన సరుకుతో వరంగల్‌ వైపునకు బయలుదేరారు. ప్రయాణం మధ్యలో ఘట్‌కేసర్‌ వద్ద వాహనం ఆపారు. బొలెరో డ్రైవర్‌ సంపంగి విక్రమ్‌ అప్రమత్తంగా వ్యవహరించి నిందితులు ఉపయోగిస్తున్న మారుతి స్విఫ్ట్‌ కారును తీసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో నిందితుల ప్రణాళిక మలుపు తిరిగింది. మిగిలిన నల్లబెల్లం పౌడర్‌ను విక్రయించేందుకు నిందితులు పలువురు కొనుగోలుదారులను సంప్రదిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న డీటీఎఫ్‌ సిబ్బంది, జనగామ ఎకై ్సజ్‌ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. పెంబర్తి వద్ద శనివారం అర్ధరాత్రి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మహీంద్రా బొలెరో వాహనం, 1,590 కిలోల నల్ల బెల్లం పౌడర్‌, 120 కిలోల ఆలం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేయగా, అరెస్ట్‌ చేసిన ఇద్దరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ కొత్తపేటలో దింపిన 27 సంచుల న ల్లబెల్లం పౌడర్‌, నిందితులు ఉపయోగించిన మా రుతి స్విఫ్ట్‌ కారు, దేవరకొండకు చెందిన పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కేసును డీటీఎఫ్‌ ఎస్సై మధు, జనగామ సీఐ ప్రభావతి, ఎకై ్సజ్‌ ఎ స్సై జనార్దన్‌ చాకచక్యంగా ఛేదించినట్లు తెలిపారు.

పెంబర్తిలో ఇద్దరి అరెస్ట్‌..

పరారీలో ముగ్గురు

1,590 కిలోల నల్లబెల్లం,

120 కిలోల ఆలం పట్టివేత

వివరాలు వెల్లడించిన జనగామ జిల్లా

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి ఎన్‌.అంజిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement