హైదరాబాద్‌లో స్టేడియాలు చూస్తే బాధగా ఉండేది | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో స్టేడియాలు చూస్తే బాధగా ఉండేది

Aug 3 2026 1:07 AM | Updated on Aug 3 2026 1:07 AM

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

వరంగల్‌ స్పోర్ట్స్‌ : ‘హెదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో మా ఆఫీస్‌ ఉండేది. బందోబస్తు లాంటి అనేక సందర్భాల్లో పక్కనే ఉన్న ఎల్‌బీ స్టేడియానికి వెళ్తే అక్కడి పరిస్థితులు చూస్తే బాధగా ఉండేది’ అని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. రెండో తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌ సెమినార్‌ ఆదివారం హనుమకొండ ‘కుడా’ కాంప్లెక్స్‌లోని శ్రీహర్ష కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతో మంది మెడలిస్టులను తయారు చేసిన ఎల్‌బీ స్టేడియం నగరం మధ్యలో ఉన్నప్పటికీ ప్రభుత్వం కాపాడుకోలేకపోయిందనే బాధగా ఉండేదన్నారు. నెల రోజుల క్రితం వరంగల్‌కు రాగానే, ఉదయం రన్నింగ్‌కు వెళ్లాలని తమ సిబ్బందితో చెబితే జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియానికి తీసుకొచ్చారన్నారు. స్టేడియం చూడగానే సంతోషంతో పాటు గర్వంగా అనిపించిందన్నారు. ఇక్కడి ప్రజలు, అసోసియేషన్‌, కోచ్‌లు, క్రీడాకారులు ఎంతో అదృష్టవంతులన్నారు. ఇక్కడి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎప్పటికై నా తెలంగాణకు వరంగల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా కావాలని కోరుకుంటున్నానన్నారు. వరంగల్‌ క్రీడాకారుల అభివృద్ధికి తమ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు సీపీ శ్వేతకు ట్రాక్‌ సూట్‌ అందజేశారు. అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రిసోర్స్‌ పర్సన్‌ హరిదాసు, తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కె. సారంగపాణి, వరంగల్‌ జిల్లా చైర్మన్‌ గట్టు మహేశ్‌బాబు, అసోసియేషన్‌ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, టెక్నికల్‌ కమిటీ చైర్మన్‌ జి.జగన్‌, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement