మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ట్రాలీలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ట్రాలీలు సిద్ధం

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ట్రాలీలు సిద్ధం

హన్మకొండ: హనుమకొండ సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం రెండు మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ట్రాలీలు సిద్ధం చేశా రు. వీటిని హనుమకొండ టౌన్‌, హనుమకొండ రూరల్‌ డివిజన్‌కు కేటాయించారు. గురువారం హ నుమకొండ సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని హనుమకొండ ఎస్‌ఈ బి.సామ్యానాయక్‌ డివిజనల్‌ ఇంజనీర్లకు అందించారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ సరఫరా అంతరాయాలను అధిగమించేందుకు, వినియోగదారులకు మెరుగైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఈ మొబైల్‌ ట్రాలీలు ఉపయోగపడుతాయన్నారు. విని యోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్‌ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబనాయక్‌, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement