● యాదాద్రి భువనగిరి జిల్లా
వెల్మజాలలో ఘటన
● మృతుడు జనగామ జిల్లా వనపర్తి వాసి
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తికి చెందిన కానుగంటి శ్రీనివాస్, అనురాధ దంపతుల కుమారుడు మణికంఠ (19) యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మ జాలలో స్నేహితులతో కలిసి ఈ తకెళ్లి నీట మునిగి మృతి చెందాడు. వనపర్తి గ్రామస్తుల కథనం ప్రకారం.. మణికంఠ ఇటీవల ట్రాక్టర్ డ్రైవింగ్ కోసం వెల్మజాలకు వెళ్లాడు. అక్కడ సంగి శ్రీశైలం అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం స్నేహితులతో కలి సి బావిలో ఈతకు వెళ్లాడు. అయితే మణికంఠకు ఈత రాకున్నా బావిలో దూకి నీటిలో మునిగి చని పోయాడు. కాగా, రెండేళ్లుగా ట్రాక్టర్ నడుపుతూ తల్లిదండ్రులకు ఆసరా అవుతున్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో అనురాధ, శ్రీనివాస్ దంపతుల రోదనలు మిన్నంటాయి. మణికంఠ మృతితో వనపర్తిలో విషాదం అలుముకుంది.


