విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

వరంగల్‌ క్రైం: పోలీస్‌ అధికారులు విధులు నిర్వహించకుండా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ హెచ్చరించారు. నెలవారీ నేర సమీక్ష గురువారం కిట్స్‌ కళాశాలలో నిర్వహించారు. ఇందులో తొలిసారిగా సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌ 2.0 ద్వారా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి పెండింగ్‌ కేసులు, నిందితుల అరెస్టులు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ కోసం సంబంధిత పోలీస్‌ అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ ఆన్‌లైన్‌ పద్ధతిలో సంబంధిత స్టేషన్‌ అ ధికారులను అడిగి తెలుకున్నారు. పెండింగ్‌ కేసుల, కేసుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్‌ అధికారులు వ్యక్తిగతంగా వెళ్లి తనిఖీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల బస్సులను స్థానిక పోలీస్‌ అధికారులు తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్‌, రాజమహేంద్ర నాయక్‌, దార కవిత, అదనపు డీసీపీలు రవి, బాలస్వామి, ప్రభాకర్‌రావు, సురేశ్‌కుమార్‌, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

పాఠశాలల సమీపంలో పొగాకు

ఉత్పత్తులు అమ్మొద్దు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement