దంతాలపల్లి: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ అన్నారు. బుధవారం మండలంలోని రామానుజాపురంలో నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత గంజాయి మత్తులో తూగుతుందని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ద్వి చక్రవాహనదారులకు హెల్మెట్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎస్సై రవికుమార్, ఉపసర్పంచ్ మల్లం మౌనిక, గ్రామ కార్యదర్శి ప్రభు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


