● మున్సిపల్ సిబ్బందిపై స్థానికుల ఆగ్రహం
డోర్నకల్: మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నెలల తరబడి తాగునీటి సరఫరా నిలిచిందని, చాలా రోజులుగా చెత్తబండ్లు రావడం లేదని, రోడ్లు అధ్వానంగా మారాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం జరిగిన వార్డు సభలో స్థానికులు సమస్యలపై మున్సిపల్ పాలకవర్గం, సిబ్బందిని నిలదీశారు. నెలల తరబడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చెత్తను తొలగించకపోవడంతో ఇళ్లు, వీధులు చెత్తతో నిండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు, పాలకవర్గం స్పందించడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ అధికారులను, పాలకవర్గాన్ని నిలదీశా రు. మున్సిపల్ చైర్‌పర్సన్ కొండేటి రాజకుమారి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సీఐ చంద్రమౌళి, డీటీ వీరన్న, సీడీపీఓ లక్ష్మి, కౌన్సి లర్లు బాదావత్ హేమలత, ఎల్లావుల సువర్ణ, గారె రమేశ్, బానోత్ ప్రమీల, ఆంగోత్ శైలజ, గుగులోత్ రాము తదితరులు పాల్గొన్నారు.


