బడిబాట.. | - | Sakshi
Sakshi News home page

బడిబాట..

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

రెండు చిలకల కథ
నేను గీసిన చిత్రం

బాస్కెట్‌ బాల్‌ నేర్చుకుంటున్నాం

కాజీపేట : హాయ్‌. నాపేరు పాము అన్విక్‌ భారతి. వేసవి సెలవుల్లో నేను కాజీపేట నుంచి అమ్మమ్మ వాళ్ల ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు మా అమ్మ గాయిత్రి, నాన్న రాజేశ్‌తో కలిసి వెళ్లా. అక్కడ మా అమ్మమ్మ నాకు రాత్రి వేళల్లో మంచి కథలు చెబుతూ నిద్రపుచ్చుతుంది. ఇందులో భాగంగా ఓ రామచిలక కథను చెప్పి నీతిని బోధించింది. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒకరోజు అతడు అడవిలోకి వేటకు వెళ్లి రెండు రామచిలకలను పట్టి తెచ్చి రాజుకు బహూకరించాడు. రాజు వాటిని వెంటనే మంత్రికి, సేనాధిపతికి చేరొటి ఇచ్చాడు. రామచిలకలకు ఎవరైతే మంచి మాటలు నేర్పిస్తారో వారికి బంగారు కానుకలు ఇస్తానని ప్రకటించాడు. మంత్రి, సేనాధిపతులు చిలకలను ఇంటికి తీసుకెళ్లి భార్యలకు ఇచ్చి రాజుగారి కానుకల విషయం తెలిపాడు. మంత్రి భార్య సంగీతం నేర్పించే గురువు కావడంతో చిలుకకు చక్కటి పద్యాలు, పాటలు, మాటలు నేర్పించింది. సేనాధిపతి భార్య పదవి ఉందనే అహంకారంతో ఏ పని చేయకుండా అందరితో కఠిన పనులు చేయిస్తూ నిత్యం వారిని తిడుతుండేది. ఆది విన్న ఆ చిలక పూర్తిగా తిట్లనే నేర్చుకుంది. మంత్రికి రాజు మీద ఎనలేని ప్రేమ ఉండడంతో చిలకకు కూడా ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది. సేనాధిపతి ఇతర రాజులతో కలిసి కుట్రలు చేస్తుండేవాడు. ఒకరోజు ఆ రెండు చిలకల ను రాజు సభకు తీసుకురావాలని ఆదేశిస్తాడు. సభలో రా జు మంత్రి చిలకను ఎలా ఉన్నావంటూ ప్రశ్నిస్తాడు. దానికి ఆ చిలక పద్ధతిగా బాగున్నాను మీరు ఎలా ఉన్నారంటూ అడుగుతుంది. రాజుకు దీంతో ఎక్కడాలేని సంతోషం కలుగుతుంది. సేనాధిపతి చిలకను ప్రశ్నించగా దానికి ఆ పక్షి నేను ఎలా ఉంటే నీకేందుకు మా సేనాధిపతి నీపై దాడి చేస్తాడు నువ్వు చస్తావు అంటుంది. వెంటనే ఆగ్రహించిన రాజు.. సేనాధిపతి బంధిని చేసి కఠినంగా శిక్షిస్తాడు.

నీతి! మంచివాళ్ల సహవాసం ఎప్పుడూ మంచే నేర్పుతుంది. అందుకే అన్నారు పెద్దలు సహవాస దోషం అని

Advertisement
 
Advertisement
Advertisement