శాంతికోసం మరియతల్లిని వేడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాంతికోసం మరియతల్లిని వేడుకోవాలి

Mar 14 2026 8:03 AM | Updated on Mar 14 2026 8:03 AM

కాజీపేట రూరల్‌ : ప్రపంచ దేశాలు.. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతి స్థాపనకు ప్రజలందరు మరియతల్లిని వేడుకోవాలని హైదరాబాద్‌ అగ్రపీఠ కాపరి మహాశ్రేష్ఠ కార్డినల్‌ అంతోని పూల సందేశమిచ్చారు. కాజీపేట ఫాతిమానగర్‌లో జరుగుతున్న ఫాతిమామాత తిరునాళ్ల మహోత్సవ వేడుకలు శుక్రవారంతో భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ముగింపులో ముఖ్యఅతిథిగా అంతోని పూల పాల్గొని దివ్యబలి పూజను సమర్పించి మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు నిలిచిపోయి ఆయా దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని మరియతల్లిని ప్రార్థించి వేడుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని ప్రజలందరికి ఫాతిమామాత ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. వరంగల్‌ జిల్లా కులమతాలకు అతీతంగా నిలుస్తోందని అన్నారు. గురుశ్రీ సుధీర్‌, ఉమేష్‌ ప్రార్థన చేసి చివరి పూజబలిని నిర్వహించారు. ఓరుగల్లు పీఠ పాలనాధికారి ఫాదర్‌ దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డి పతాక అవరోహణ చేసి ఫాతిమామాత ముగింపు ఉత్సవాలను ప్రకటించారు. అంతోని పూ ల, డి.విజయపాల్‌రెడ్డి, ఫాదర్లను, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని అంతోని పూల, విజయపాల్‌రెడ్డి సన్మానించారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో గెలిచిన వా రికి బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చిన భక్తులు, విశ్వాసులు క్యాండిల్స్‌, కొబ్బరి కాయలు, తలనీలాలతో మరియమాతకు మొక్కులు సమర్పించారు. కార్పొరేటర్‌ మానసరాంప్రసాద్‌, విశ్రాంత అగ్రపీఠ కాపరి మహాపూజ్య జోసెఫ్‌ హరిష్‌, ఫాదర్లు కాసుమర్రెడ్డి, కొమ్మారె డ్డి జోసెఫ్‌, టి.జోసెఫ్‌, జి.అనుకిరణ్‌, సింగారెడ్డి ఇ న్నారెడ్డి, ఇతర గురువులు, దైవాంకితులు, కెథడ్రల్‌ చర్చీ కమిటీ, క్వాయర్‌ టీం, మఠకన్యలు, భక్తులు, విశ్వాసులు, వివిధ జిల్లాల ప్రజలు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ అగ్రపీఠ కాపరి

కార్డినల్‌ అంతోని పూల

ముగింపు ఉత్సవాలను ప్రకటించిన

ఓరుగల్లు పాలనాధికారి

ఫాదర్‌ విజయపాల్‌రెడ్డి

పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement