పన్నులు వసూలయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

పన్నులు వసూలయ్యేనా?

Mar 14 2026 8:03 AM | Updated on Mar 14 2026 8:03 AM

నర్సంపేట : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఒక కార్పొరేషన్‌, 12 మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు మరో 18 రోజులు ఉండగా సరాసరి 50 శాతం మాత్రమే పన్నులు వసూళ్లయ్యాయి. మిగిలిన 50 శాతం వసూళ్లపై అనుమానాలు నెలకొన్నాయి. గడువులోగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కార్పొరేషన్‌, మున్సిపాలిటీల సిబ్బంది కృషి చేస్తున్నా అది సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యేక బృందాల ద్వారా ప్రణాళికలు..

ఈనెల ముగింపు లోపు పన్నుల వసూళ్లు పూర్తి చేయాలనే ప్రణాళికలతో అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సమయం తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ సిబ్బంది ద్వారా ఇంటింటికి తిరిగి పన్నులు వసూళ్లు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి 15 నాటికి తక్కువ శాతం నమోదు కావడంపై అధికారుల్లో ఆందోళన నెలకొంది.

శాశ్వత ఉద్యోగులకే బాధ్యతలు..

ఆస్తి పన్ను వసూళ్లను సిబ్బంది చేతి యంత్రం (హ్యాండ్‌, హోల్డ్‌ మిషన్‌)లో పీటీఏఎస్‌(ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) నమోదు ఎంత పన్ను బకాయి ఉందో చెప్పి డబ్బులు వసూలు చేసి రశీదు అందజేస్తున్నారు. సేకరించిన నగదును కార్యాలయంలోని క్యాష్‌ కౌంటర్‌లో జమ చేస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగుల కొరత కారణంగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పన్ను వసూలు విధులు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో పన్నుల డిమాండ్‌.. వసూలు (12వ తేదీ నాటికి..)

మున్సిపాలిటీ అసెస్‌మెంట్స్‌ డిమాండ్‌ వసూలు శాతం

నర్సంపేట 16,843 4.53 కోట్లు 1.94 కోట్లు 42.83

కేసముద్రం 6,440 1.5 కోట్లు 0.71 67.62

తొర్రూరు 6,710 4.85 కోట్లు 3.10 కోట్లు 63.92

మహబూబాబాద్‌ 22,967 6.80 కోట్లు 3.77 కోట్లు 55.44

పరకాల 9,157 3.82 కోట్లు 2..03 కోట్లు 53.14

భూపాలపల్లి 12,413 6.06 కోట్లు 3.19 కోట్లు 52.64

జనగామ 15,833 6.15 కోట్లు 3.15 కోట్లు 51.22

డోర్నకల్‌ 3,466 1.42 కోట్లు 0.66 46.15

ములుగు 5,554 1.27 కోట్లు 0.59 46.46

మరిపెడ 5,519 2.09 కోట్లు 0.87 41.63

జీడబ్ల్యూఎంసీ 2,36,200 181.50 కోట్లు 71.13 కోట్లు 39.19

స్టేషన్‌ఘన్‌పూర్‌ 6,471 2.12 కోట్లు 0.77 36.32

వర్ధన్నపేట 3,444 1.14 కోట్లు 0.61 53.51

ఉమ్మడి జిల్లాలో నత్తనడకన

ట్యాక్స్‌ వసూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement