కేయూ క్యాంపస్ : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్‌ను సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారు జామునుంచే కేయూలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి, విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగ జేఏసీ పిలుపునిస్తే ఇక్కడ అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపించారు. అరెస్టయిన వారిలో కామగోని శ్రావణ్, మంద శ్రీకాంత్, మర్రి మహేష్, ఎల్తూరి సాయికుమార్, రాచకొండ రంజిత్, అశోక్, సేవాలాల్, బీఆర్‌ఎస్‌వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ తదితరులు ఉన్నారు.


