రోడ్డు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించండి
మహబూబాబాద్ అర్బన్: రోడ్డు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్‌లో గురువారం ప్రైవేట్ పాఠశాలల బస్సుల డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు లయన్స్ క్లబ్ సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వాహన డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటించాలని, వాహనా లను ఓవర్‌టేక్ చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యే క శ్రద్ధ వహించాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. పాఠశాలల బస్సులు క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ ఉండే విధంగా నిత్యం తనిఖీలు చేసుకోవాలన్నారు. వాహనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిం చాలన్నారు. ఫైర్ అధికారి టి.మోహన్‌రావు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు సాయిచరణ్, వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్‌కుమార్, డీపీఆర్‌ఓ రాజేందర్‌ప్రసాద్, వైద్యాధికారులు మౌనిక, నర్మద ఉన్నారు.


