మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి
మహబూబాబాద్: మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఽశ్రీధర్ అన్నారు. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల శిక్షణలో స్కూల్ అసిస్టెంట్‌లు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల శిక్షణ విధుల నుంచి వారిని మినహాయించాలన్నారు. మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉన్నత పాఠఽశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లను మాస్టర్ ట్రైనర్లుగా నియమిస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా నియమించాలన్నారు. కార్యక్రమంలో మహేశ్, లింగన్న, వెంకట్‌రెడ్డి, కరుణాకర్, హల్యా, నాగరాజు పాల్గొన్నారు.
యూరియా కోసం
ఆందోళన వద్దు
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబా బాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో యూరియా పంపిణీపై స్థానిక రైతు వేదికలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ మండలానికి సరిపడా యూరియా సరఫరా చేస్తున్నారని తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తూ రైతులకు యూరియాను సకాలంలో అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఏఓ బి.సరిత, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓలు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్‌ఈ
మహబూబాబాద్ రూరల్ : విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం గ్రామంలో విద్యుత్‌శాఖ అధికారులు గురువారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యల గురించి తెలుసుకోవడానికి విద్యుత్ అధికారులు ప్రజా బాట కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ప్రజలు తమ విద్యుత్ సమస్యలను తెలియజేస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా బాటలో భాగంగా విద్యుత్ సమస్యల గురించి తెలుసుకుని తుప్పు పట్టిన స్తంభాలను మార్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంపటి రమేష్, ఉప సర్పంచ్ మద్ది వెంకటరెడ్డి, విద్యుత్ రూరల్ ఏడీఈ ప్రశాంత్, రూరల్ ఏఈ పీక వెంకటేష్, సిబ్బంది వీరాచారి, కుదురుపాక వివేక్, వీరభద్రం, సత్యనారాయణ, సంపత్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నెలల పాటు బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ నిమిత్తం అర్హులైన శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఎంపీయూపీఎస్ స్కూల్స్–9, హైస్కూల్స్– 92, మొత్తం 101 పాఠశాలల బాలికలను సెల్ఫ్ డిఫెన్స్‌కు ఎంపిక చేశామని, దరఖాస్తులు ఈ నెల 9నుంచి 12వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పిచాలన్నారు. శిక్షకులకు నెలకు రూ.5వేల చొప్పున 3 నెలలు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. శిక్షణ కోసం మహిళా శిక్షకులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, మహిళలు లేకపోతే పురుష శిక్షకులను ఎంపిక చేస్తామన్నారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి
మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి
మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి


