పొగమంచుతో జాగ్రత్త
● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో ఉదయం వేళల్లో పొగమంచు పడు తుందని, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ఎస్పీ శబరీష్ శుక్రవారం తెలిపారు. పొగమంచు కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా ప్రయాణించడంతో పాటు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. పొగమంచు ఉన్న సమయంలో వేగం తగ్గించి వాహనం నడపాలని, హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. వాహనాల మధ్య తగిన దూరం పాటించాలని, అనవసరంగా ఓవర్‌టేక్ చేయవద్దని, మద్యం తాగి వాహనం నడపకూడదన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని సూచించారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
పొగమంచుతో జాగ్రత్త


