బాధ్యతలు స్వీకరించిన డీఏఓ సరిత
మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో డీఏఓగా సరిత శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేసిన ఎం.విజయనిర్మల పదోన్నతిపై వరంగల్ ఆత్మ జాయింట్ డైరెక్టర్‌గా విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ఆమె నూతన డీఏఓకు బాధ్యతలు అప్పగించారు. అధికారి సరిత మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల అవసరాల మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. పంటల సాగు ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులకు యూరియా అందజేస్తామని చెప్పారు.
సకాలంలో యూరియా పంపిణీ చేయాలి
మహబూబాబాద్ రూరల్: రైతులకు యూరియా పంపిణీలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆత్మ మరిపెడ డివిజన్ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి బి.సరితను కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ యంత్ర పరికరాలను త్వరితగతిన అందించాలని, యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు, సీపీఐ నాయకులు పోలెపాక వెంకన్న, డీఏఓ కార్యాలయ ఏడీఏ మురళి, టెక్నికల్ ఏఓ జావీద్, సీరోలు ఏఓ ఛాయారాజ్ పాల్గొన్నారు,
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: గిరిజన, సాంఘిన సంక్షేమ, ఎంజేపీ, మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి పూర్తిస్థాయిలో, 6నుంచి 9వ తరగతుల్లో ఖాళీసీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. నాగేంద్రమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు మీసేవ కేంద్రాల్లో మాత్రమే రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న ఉయదం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 83338 00221, 040–23391598 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కవులు
మహబూబాబాద్ రూరల్: ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా నుంచి 20మంది కవులు, రచయితలు శుక్రవారం గుంటూరుకు తరలివెళ్లారు. ఈ నెల 3,4,5 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ తెలి పారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో గజల్ శ్రీని వాస్ నేతృత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఆరు వేదికల్లో అనే క సాహిత్య, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, పుస్తక, కార్టూన్లు, ఆధ్యాత్మిక ప్రదర్శనలతో పాటు రాజకీ య, సినీ ప్రముఖులు పాల్గొంటుండగా దేశ, విదేశాల నుంచి వేలాది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక జి ల్లా అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ సమన్వయంలో కోటగిరి వెంకట నర్సయ్య, కస్తూరి పులేందర్, నాళ్లం శ్రీనివాస్, బొమ్మిడి వినోద్ రెడ్డి, బొడ్డుపల్లి వీరస్వామి, రేణిగుంట్ల లక్ష్మీకాంతారావు, బా ణాల వీరయ్య, తొట్ల వెంకటలక్ష్మి, రేణిగుంట్ల శ్రీదేవి, ఉషారాణి, కొంగ మమతాదేవి వెళ్లారు.
‘పింగిళి’లో కథా
సర్టిఫికెట్ కోర్సు షురూ
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘సృజనాత్మక రచన, కథ’ అంశంపై సర్టిఫికెట్ కోర్సును ముఖ్య అతిథిగా హైదరాబాద్ ప్రెస్ బ్యూరో డైరెక్టర్ కోటేశ్వర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథలు మానవ జీవి తాన్ని ప్రతిబింబింపజేస్తాయన్నారు. ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రమౌళి, తెలుగు విభా గాధిపతి ఎస్.మధు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామారత్నమాల, సునీత, రామాకృష్ణారెడ్డి, మాధవి, యుగేంధర్, రాజ్‌కుమార్ ఉన్నారు.
బాధ్యతలు స్వీకరించిన డీఏఓ సరిత


