కలర్స్‌ లేక కళావిహీనం.. | - | Sakshi
Sakshi News home page

కలర్స్‌ లేక కళావిహీనం..

Jan 1 2026 1:52 PM | Updated on Jan 1 2026 1:52 PM

కలర్స్‌ లేక కళావిహీనం..

కలర్స్‌ లేక కళావిహీనం..

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క తల్లి కొలు వుదీరిన చిలకలగుట్టకు ప్రత్యేక ఉంది. జాతర సమయంలో అమ్మవారిని చిలకలగుట్టపై నుంచి డోలువాయిద్యాలతో పూజారులు అంగరంగవైభంగా మేడారంలోని గద్దైపెకి తీసుకొస్తారు. ప్రభు త్వ గౌరవ వందనాలతో సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. ఇంత గొప్ప ప్రాచుర్యం కలిగిన చిలకల గుట్ట ప్రహరీపై ఏర్పాటు చేసిన ఆదివాసీ చి త్రాలకు నేటి వరకూ రంగులు(కలర్స్‌) వేయలేదు. ఫలితంగా ఆ చిత్రాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ చిత్రాలకు రంగులు వేస్తారా? లేదా అనే సందేహాలు పూజారుల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రహరీపై రంగులు వెలసిన ఆదివాసీ చిత్రాలు

చిలకలగుట్ట ప్రహరీపై గత జాతరలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా గిరి జన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ చిత్రాలు ఏర్పాటు చేసి రంగులు వేశారు. రెండేళ్ల కాలంలో చిత్రాలు రంగులు వెలసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. జాతర అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ఆది వాసీ చిత్రాలకు రంగులు వేసేందుకు నిర్లక్ష్యం ఎందుకుని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు.

గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో జాతర

మేడారం జాతర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో నే జరుగుతుంది. కానీ ఆ శాఖ అధికారులు మా త్రం జాతరపై పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివాసీ సంస్కృతికి పెద్దపీట వేయాల్సిన అధికారులు జాతర నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా చిత్రాలకు రంగులు వేయాలని కోరుతున్నారు.

చిత్రాలకు రంగులు వేయడంలో నిర్లక్ష్యం

మేడారం చిలకలగుట్ట ప్రహరీపై ఏర్పాటు చేసిన చిత్రాలకు నేటి వరకూ రంగులు వేయకపోవడం గిరిజన సంక్షేమశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రహరీపై గతంలో వేసిన చిత్రాల రంగులు వెలిసిపోయాయి. ఇప్పటికై నా స్పందించి వెంటనే చిత్రాలకు రంగులు వేయాలి.

కొప్పుల రవికుమార్‌, ఆదివాసీ విద్యార్థి

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

చిలకలగుట్ట ప్రహరీపై వెలిసిపోయి

కనిపిస్తున్న ఆదివాసీ సంస్కృతి,

సంప్రదాయాల చిత్రాలు

జాతర సమీపిస్తున్నా రంగుల ఊసేలేదు..

పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement