రైతులందరికీ యూరియా అందిస్తాం
దంతాలపల్లి: రైతులందరికీ యూరియా అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని తొర్రూరు ఆర్డీఓ గణేశ్ అన్నారు. మండల కేంద్రంలోని యూరియా పంపిణీ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఎంత యూరియా నిల్వ ఉంది.. రైతులకు ఏ మేరకు అందుతుందనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. యూరియా విషయంలో రైతులను ఎవరు ఇబ్బంది పెట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్‌కుమార్, ఏఓ వాహిని, తదితరులు ఉన్నారు.
యూరియా పంపిణీని పరిశీలించిన ఏడీఏ
బయ్యారం: మండల కేంద్రంలోని రైతువేదికలో యూరియా పంపిణీని బుధవారం ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ యూరియా అందిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ దీపిక, ఏఓ రాజు, ఎస్సై తిరుపతి, ఇల్లెందు ఏఎంసీ వైస్‌చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


