వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద భక్తులు స్నానాలు ఆచరించారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద జంపన్న గద్దె వద్ద భక్తులు పూజలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం ప్రాంతంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.


