మేఘనారాణి, భావన మృతదేహాలను తీసుకొస్తాం
గార్ల: అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలోని అలబామ లోయలో కారు పడిన ఘటనలో మృతి చెందిన గార్ల, ముల్కనూరు గ్రామాలకు చెందిన మేఘనారాణి, భావన మృతదేహాలను త్వరలో ఇండియా తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడానని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం గార్ల, ముల్కనూరు గ్రామాలకు చెందిన మృతులు పుల్లఖండం మేఘనరాణి, కడియాల భావన ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించారు. మేఘనారాణి, భావన మృతదేహాలను అతి త్వరలో ఇండియాకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డికి కోరన్నారు. దీంతో సీఎం రేవంత్.. ఇద్దరి యువతల మృతదేహాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మృతుల తల్లిదండ్రులు మాట్లాడుతూ అమెరికా లోని తానా స్వచ్ఛంద సహకారంతో మృతదేహాలను ఇండియాకు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తమకు తెలిసిందన్నారు. సోమ, మంగళ వారాల్లో మృతదేహాలు గార్లకు రానున్నట్లు అమెరికాలోని తమ బంధువులు ఫోన్ ద్వారా తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఏఎంసీ చైర్మన్ భూక్యా నాగేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దనియాకుల రామారావు, టి. కృష్ణగౌడ్, సర్పంచ్‌లు బానోత్ పార్వతి హథీరాం, గంగావత్ రాంసింగ్, సి.హెచ్. వెంకట్రావ్, భద్రు, బి. మోతీలాల్, మాజీ జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య


