ఓటాయి ప్రాంతంలో పులి సంచారం
● తోడు కోసం జిల్లాలు దాటి
తిరుగుతున్న టైగర్
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రేంజ్ పరిధిలోని ఓటాయి బీట్ అటవీ ప్రాంతంలో అధికారులు బుధవారం పులి ఆనవాళ్లు గుర్తించారు. ఇటీవల ములుగు జిల్లా పరిధిలో సంచరించిన పులి.. అక్కడ నుంచి తోడు కోసం వెతుకుతూ ఓటాయి బీట్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో పులి ఎదకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో పులి అడవి మొత్తం తిరగడం సహజమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, పులి.. ఓటాయి అటవీ ప్రాంతంలో ఆరు నెలల క్రితం జంగవానిగూడెం గ్రామానికి చెందిన రైతుకు చెందిన దుక్కిటెద్దును చంపింది. మళ్లీ రేణ్యతండా సమీప అటవీ ప్రాంతంలోని వాగులో పులి పాదముద్రలు గుర్తించి న పశువుల కాపరులు.. అటవీ శాఖ అధికా రులకు సమాచారం అందించగా వారు వెళ్లి పాదముద్రలు సేకరించారు. వీటి ఆధారంగా ఆడపులి అయి ఉండొచ్చనే అంచనాకు వ చ్చినట్లు సమాచారం. కాగా, సమీప గ్రామా ల రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


