కేయూ బాస్కెట్‌బాల్ టీం కెప్టెన్‌గా తులసి
మహబూబాబాద్ అర్బన్: కాకతీయ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టీం కెప్టెన్‌గా నలంద డిగ్రీ కళాశాల విద్యార్థిని చెవుల తులసి ఎంపికై నట్లు ఆ కళాశాల కరస్పాండెంట్ డోలి సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో తులసిని కళాశాల అధ్యాపకులు, సీనియర్ క్రీడాకారులు శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం కల్పిస్తున్నామని, తులసి కేయూ బాస్కెట్ బాల్ టీం కెప్ట్‌న్‌గా ఎంపికవ్వడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వై. కృష్ణప్రసాద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
తొర్రూరు: తొర్రూరు బస్ డిపో పరిధిలో నేడు (శనివారం) ఉదయం 11నుంచి 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం పద్మావతి తెలిపారు. వివిధ మార్గాల్లో కొత్త బస్సు సర్వీసుల కేటాయింపు, వేళల్లో మార్పులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు, సంస్థ ఉన్నతికి చేపట్టాల్సిన చర్యలపై ప్రజలు నేరుగా తమ సూచనలు, సలహాలు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఆసక్తిగలవారు 9959226053 ఫోన్ నంబర్‌లో నిర్ణీత సమయంలో ఫోన్ చేయవచ్చని తెలిపారు.
పంచాయతీ కార్యాలయం సందర్శన
బయ్యారం: మండలంలోని కొత్తపేట పంచాయతీ కార్యాలయానిన జాతీయ ఎస్టీ కమిష న్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న సర్పంచ్ ప్రవీణ్‌నాయక్‌ను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న పాలకవర్గం ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టి వారి మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు సురేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కేయూ బాస్కెట్‌బాల్ టీం కెప్టెన్‌గా తులసి


