పార్కులపై పట్టింపేది
అధ్వానంగా మారిన పార్కులు, ఓపెన్ జిమ్‌లు
అధ్వానంగా చిల్డ్రన్స్ పార్కులు..
కొన్ని గ్రీన్‌ల్యాండ్‌లలో చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేశారు. వాటిలో ఆట వస్తువులు మాత్రమే ఏర్పాటు చేశారు. లక్షలు వెచ్చించారు..కానీ ప్రహరీ లేక, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పందుల సంచారం పెరిగింది. పార్కులు అపరిశుభ్రంగా మారడంతో దోమల సంఖ్య పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థాని కులు అంటున్నారు.
ఎన్జీఓఎస్ కాలనీలో పాడైపోయిన ఆట వస్తువులు
మహబూబాబాద్: ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యంతో పాటు గ్రీన్ ల్యాండ్స్ పరిరక్షణలో భాగంగా పార్కులు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. ఆట వస్తువులు, జిమ్ పరికాలు పూర్తిగా మరమ్మతుల బారిన పడి చాలా వరకు నిరుపయోగంగా మారాయి. ఒక్కో పార్కు, జిమ్‌ను లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఆహ్లాదం కోసం..
మానుకోట విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఆరు పార్కులు, తొమ్మిది ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. వాటిని గ్రీన్ ల్యాండ్‌లలో ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరీ నిర్మాణం కూడా చేయడంతో కబ్జా కు గురికాకుండా ఉన్నాయి. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోనిచాలా గ్రీన్‌ల్యాండ్స్ కబ్జాకు గురవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్కులు పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నాయి.
ఆరు పార్కులు..
పట్టణంలోని ఎన్జీఓఎస్ కాలనీ, ఇందిరాగ్రౌండ్, బ్రహ్మకుమారి మందిరం సమీపంలో, మహర్షి విద్యాలయం సమీపంలో, హౌసింగ్ గ్ బోర్డు కాలనీలో పార్కులు ఏర్పాటు చేశారు. 18వ వార్డు పరిధిలో బటర్‌ఫ్లై పార్కు ఏర్పాటు చేశారు. పార్కులలో ఆటవస్తువులతో పాటు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, అలంకరణ మొక్కలు, సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు.
తొమ్మిది ఓపెన్ జిమ్‌లు..
ఎన్జీఓఎస్ కాలనీలోని పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఇందిరాగ్రౌండ్ పార్కులో, బ్రహ్మకుమారి మందిరం సమీపంలోని పార్కులో, యశోద గార్డెన్ ఎదుట, ఎన్టీఆర్ స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కాలేజీ(బాలుర)శనిగపురం, హైమాగార్డెన్, కంకరబోడ్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేఽశారు. ఎన్టీఆర్ స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కళాశాల జిమ్ మాత్రం ప్రభుత్వ స్థలంలో.. మిగిలినవి గ్రీన్ ల్యాండ్‌లలో ఏర్పాటు చేశారు.
అధ్వానంగా నిర్వహణ..
పార్కుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు ఆట వస్తువులు చాలా వరకు మరమ్మతుల బారిన పడ్డాయి. బెంచీలలో కూడా చాలా వరకు పగిలిపోయాయి. జిమ్‌లలో పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. దీంతో వాకర్స్‌తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాడైపోయిన ఆట వస్తువులు, జిమ్ పరికరాలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
పందులకు ఆవాసంగా చిల్డ్రన్స్ పార్కులు
నూకల రామచంద్రారెడ్డి పార్కు ఏర్పాటు.. నేడు ఆవిష్కరణ
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న కంబాలచెరువు పక్కనే సుమారు 12గుంటల భూమిలో నూకల రామచంద్రారెడ్డి స్మారకార్థం పార్కు ఏర్పా టు చేశారు. పట్టణ ప్రగతి నిధులతో పాటు పలు గ్రాంట్‌ల నుంచి సుమారు రూ.50లక్షల వ్యయంతో నిర్మించారు. ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆపార్కును ఈనెల 27న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆవిష్కరణ ఉదయం 11.10 గంటలకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, అధికారులు పార్కుల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నారే తప్ప, నిర్వహణపై దృష్టి పెట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్కులపై పట్టింపేది
పార్కులపై పట్టింపేది
పార్కులపై పట్టింపేది


