స్వగ్రామం చేరిన ఆజాద్..
● ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
గోవిందరావుపేట : ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న మంగళవారం తన స్వగ్రామం మండల పరిధిలోని మొద్దులగూడేనికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆజాద్ మాట్లాడారు. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగానన్నారు. ఇటీవల పోలీసులకు లొంగిపోయిన తాను ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నెల రోజుల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. కాగా, అంతకు ముందు ఆజాద్ అలియాస్ గోపన్న తన తల్లి లచ్చమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్వగ్రామం చేరిన ఆజాద్..


