విద్యుదాఘాతంతో రైతు మృతి
రేగొండ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని రామన్నగూడెం తండా గ్రామంలో జరిగింది. ఎస్సై రాజేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అజ్మీరా రూప్లా నాయక్ (75) తన మొక్క జొన్న పంటకు నీరు పారించేందుకు వెళ్లాడు. మోటారు ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.


