రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి
కురవి: టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) జెడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యాసదస్సు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28న జనగామ జిల్లా కేంద్రంలో జరగబోయే విద్యాసదస్సులో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు హాజరవుతారని తెలిపారు. అన్ని మండలాల నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. జానయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు బాబు, శ్రీనివాస్, విజయరాణి, సుహాసిని, రాధిక, శోభారాణి, రమేశ్, సైదన్న, శ్రీనివాస్, గోపాల్, యాకలత, విజయలక్ష్మి పాల్గొన్నారు.
వ్యర్థ వస్తువులతో
ఆదాయం పొందాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు చదువుతో పాటు వ్యర్థ వస్తువులతో ఆదాయం పొందాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల హోలిఏంజిల్స్ హైస్కూల్‌లో సోమవారం డివిజన్ పరిధిలో వేస్ట్ వెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిషన్‌ను డీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పరిసరాల్లోని చెత్త, ఇంట్లో నుంచి వచ్చిన తడి, పొడి చెత్త నుంచి ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అనంతరం మొదటిస్థానంలో నిలిచిన ఏకశిల హోలిఏంజిల్స్ స్కూల్, ద్వితీయ స్థానంలో నిలిచిన మోడల్ స్కూల్, తృతీయ స్థానంలో నిలిచిన కంబాలపల్లి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీఈఓ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారి విద్యాసాగర్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలికల భద్రతే షీటీం లక్ష్యం
మహబూబాబాద్ అర్బన్: బాలికలు, మహిళల భద్రతే లక్ష్యమని షీ టీం ఎస్సై సునంద అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సోమవారం షీటీం, భరోసా ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బాలికలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసిన, వేధించిన, ఇబ్బందికరంగా మాట్లాడినా.. వెంటనే 100, 1098, వాట్సాప్ 8712656935 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చల్లగాలి మెజెస్, ప్రిన్సిపాల్ పుల్లారావు, షీటీం సిబ్బంది సుధాకర్, రమేష్, అరుణ, పార్వతి, జ్యోత్స్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీహెచ్‌డబ్ల్యూఓ జిల్లా నూతన కమిటీ
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫోరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ హాస్టల్‌లో సోమవారం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కాగా, టీహెచ్‌డబ్ల్యూఓ అసోసియేట్ అధ్యక్షుడిగా నర్సింగ్‌తిరుమలరావు, జిల్లా అధ్యక్షుడిగా సదానందం, ప్రధాన కార్యదర్శిగా స్వామి, కోశాధికారిగా పైడి, ఉపాధ్యక్షులుగా పద్మ, కల్పన, పూర్ణచందర్, జాయింట్ సెక్రటరీలుగా ఎల్లస్వామి, సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ ఎన్నికల అధికారి రోహిత్, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి
రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి


