
ఈసీజీ టెక్నీషియన్లపై దాడి
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్లపై రోగితోపాటు ఆమె బంధువులు మంగళవారం రాత్రి దాడికి పాల్ప డ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ దేశాయిపేట ప్రాంతానికి చెందిన వివాహిత హా రికకు చాతీలో నొప్పి రావడంతో భర్త రాజేశ్, తండ్రి అరుణ్‌తో కలిసి చికిత్స నిమిత్తం ఎంజీఎంలోని క్యాజువాలిటీ విభాగానికి వచ్చింది. పరీక్షించిన వై ద్యులు ఈసీజీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో హారిక ఈసీజీ పరీక్షల కోసం క్యూలో ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఓ రోగికి ఈసీజీ పరీక్ష నిర్వహించిన టెక్నీషి యన్లు మోబిన్, వసంత్‌కుమార్‌పై హారిక తోపాటు ఆమె భర్త, తండ్రి దాడికి పాల్ప డ్డారు. ఘటనను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు. కాగా, ఈఘటనపై తప్పు జరిగిందని హారికతోపాటు రాజేశ్, అరుణ్.. ఈసీజీ టెక్నీషియన్లను వేడుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.