గణపతి మండపం ఏర్పాటులో అపశ్రుతి.. | - | Sakshi
Sakshi News home page

గణపతి మండపం ఏర్పాటులో అపశ్రుతి..

Aug 27 2025 9:35 AM | Updated on Aug 27 2025 9:35 AM

గణపతి మండపం ఏర్పాటులో అపశ్రుతి..

గణపతి మండపం ఏర్పాటులో అపశ్రుతి..

నెక్కొండ: గణపతి మండపం ఏర్పాటులో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డా డు. ఈ ఘటన మంగళవారం మండలంలోని నెక్కొండ తండాలో జరిగింది. తండాకు చెందిన బానోత్‌ పవన్‌ సెంట్రింగ్‌ కర్రలను మిషన్‌ (విద్యుత్‌ రంపం)తో కట్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో రంపం అదుపు తప్పి పవన్‌ ఎడమ చేయికి తగలగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మండప నిర్వాహకులు హుటాహుటినా హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పవన్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయని కుటుంబీకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement