
ఉపాధ్యాయుడు రాజేందర్‌పై క్రిమినల్ కేసు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జి ల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల సై న్స్ ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్‌పై క్రిమి నల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ప్రకటనలో తెలిపారు. రాజేందర్ మూడు రోజుల క్రితం పాఠశాలలో విద్యార్థులు తాగే ఆర్వో ప్లాంట్‌లో క్రిమిసంహారక మందు కలిపినట్లు నిర్ధారించా మని పేర్కొన్నారు. ఎంఈఓ దేవానాయక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేట్టారు. ఇందులో ప్రస్తుత ప్రత్యేకాధికారి వెంకటనర్సయ్యపై వ్యక్తిగత విభేదాల కారణంగా పాఠశాల ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాజేందర్ కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కుట్రలో భాగంగా ఈ నెల 21వ తేదీన రాత్రి తాగునీటి ట్యాంకులో హానికర పురుగులమందు కలిపినట్లు విద్యార్థులు గమనించి పోలీసులకు తెలిపారన్నారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి రాజేందర్ తాగునీటిలో విషం కలిపారని నిర్ధారించినట్లు తెలిపారన్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది..
తాగునీటిలో క్రిమిసంహారక మందు కలిపిన ఘట నలో ఉపాధ్యాయుడు రాజేందర్‌ను అరెస్ట్ చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ తరహా దారుణ చర్యలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేలేదన్నారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దర్యాపు పూర్తి స్థాయిలో కొనసాగుతోందన్నారు. సమావేశంలో సీఐ నరేశ్‌కుమార్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు.