
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
కేసముద్రం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కల్వల జెడ్పీ హైస్కూల్, పీఎస్‌లను శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సబ్జెక్టులవారీగా విద్యాబోధన చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం వండే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం డైనింగ్ హాల్, కిచెన్‌షెడ్లు, మరుగుదొడ్లు, తరగతి గదులను, స్టోర్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ క్రాంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్లినిక్‌ను
వినియోగించుకోవాలి
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి శాలిని
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని అన్నారు. జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను శనివారం ఆమె ప్రారంభించిన మాట్లాడారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్‌కు అలవాటు పడిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి మంచిపౌరులుగా తీర్చిదిద్దడానికి క్లినిక్ ఉపయోగపడుతుందన్నారు. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అని పరిష్కారం కోసం డీ అడిక్షన్ సెంటర్ సాయం తీసుకోవడం ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సమితిలో
నలుగురికి చోటు
● రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా
విజయసారథి
నెహ్రూసెంటర్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీ ఐ) రాష్ట్ర సమితిలోకి జిల్లా నుంచి నలుగురికి చోటు దక్కింది. పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ జి ల్లా గాజులరామారంలో 3 రోజుల పాటు నిర్వహించి నూతన సమితిని ఎన్నుకోగా జిల్లాకుచోటు కల్పించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బి.విజయసారథి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి.అజయ్‌సారథిరెడ్డి, నల్లు సుధాకర్‌రెడ్డి, కట్టెబోయి న శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బి.విజయసారథి మాట్లాడుతూ... పార్టీ రాష్ట్ర బాధ్యతలతో బాధ్యత పెరిగిందన్నారు.
అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: అంగన్‌వాడీలు హెచ్‌ఐవీ రహిత సమాజ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని అందుకు గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలు, గర్భిణులకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు శనివారం మహబూబాబాద్‌లో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ... గర్భస్థ శిశువుకు హెచ్‌ఐవీ సోకకుండా గర్భం దాల్చిన వెంటనే ప్రభు త్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని సూ చించారు. గర్భిణులు అంగన్‌వాడీ సెంటర్లలో తప్పకుండా నమోదు చేసుకుని పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం ఎయిడ్స్‌పై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు విజయ్ కుమార్, సారంగం, డెమో ప్రసాద్, ఎంపీహెచ్‌ఈఓ లోక్య, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, సీఎస్‌ఓ సారయ్య, ఎస్‌ఎస్‌కే మేనేజర్ రమేష్, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్ పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి