
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్‌కు శనివారం ఇఫ్కో కంపెనీకి చెందిన 1,340.010 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇఫ్కో కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు రవీందర్‌రెడ్డి, విజ్ఞాన్ వ్యాగన్‌లోని యూరియాను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూరియాను ఉమ్మడి జిల్లా పరిధిలోని ఫర్టిలైజర్ షాపులకు 40 శాతం, మార్క్‌ఫెడ్‌కు 60 శాతం పంపిస్తామని వారు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
కాజీపేట : దర్గా కాజీపేటకు చెందిన చాడ శ్రీలేఖ (30) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చె ందగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాజీపేటకు చెందిన శ్రీలేఖకు దర్గా ప్రాంతానికి చెందిన చాడ శ్రావణ్‌కుమార్‌తో 2014లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెళ్లయిన కొద్దికాలం అన్యోన్యంగా ఉన్నారు. అనంతరం మనస్పర్థలతో ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీలేఖ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందనే సమాచారం మేరకు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయనే తల్లి చింతకింది లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
కడవెండిలో
సురవరం జ్ఞాపకం..
దేవరుప్పుల : మండలంలోని కడవెండిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి యోధుడు దొడ్డి కొమురయ్య స్మారక భవన నిర్మాణంలో సీపీఐ పక్షాన కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ జాతీయ నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి భాగస్వామ్యం జ్ఞాపకం పదిలంగా ఉంది. నిర్బంధ కాలంలో దొడ్డి కొమురయ్య భవన్ ఏర్పాటు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నక్సల్స్ అనుబంధ పార్టీల సహకారంతో స్థల సేకరణకు శ్రీకారం చుట్టగా సీపీఐ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించి సుధాకర్ రెడ్డి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ తరుణంలో డీకే ఫౌండేషన్ ప్రతినిధులు సురవరాన్ని కలిసి ఫొటో దిగారు. ఇది చిరస్మరణీయమని ఫౌండే షన్ ప్రతినిధి అస్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు.

యూరియా వచ్చేసింది..

యూరియా వచ్చేసింది..