
పూలు అమ్మబోయి విగతజీవిగా మారి..
దేవరుప్పుల : ఓ హమాలీ బో నాల పండుగ సందర్భంగా పూ లు అమ్మబోయి విగతజీవిగా మారాడు. డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. ఈ ఘటన దేవరప్పులలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చిట్టబోయిన వీరయ్య(55) హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన ఇద్దరు కూతుళ్లు పూలు, పండ్ల వ్యాపారం చేస్తుండగా వారికి చేదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా సాయంత్రం సైకిల్‌పై పూలు అమ్మడానికి వెళ్లా డు. తిరిగి ఇంటికొచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు ఎస్సీ కాలనీలోని డ్రెయినేజీలో పడి ఊపిరాడక మృతి చెందాడు. రాత్రి అయినా వీరయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. శుక్రవారం వెతుకుతున్న క్రమంలో వీరయ్య డ్రెయినేజీలో పడిపోయిన విషయం తెలిసింది. వెంటనే వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన్‌కుమార్ తెలిపారు.
92 దస్తావేజులకు
ఈ–సైన్ రిజిస్ట్రేషన్
కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పైలట్ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేయగా గురువారం ఈ– సైన్ రిజిస్ట్రేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. రెండో రోజు శుక్రవారం కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లు రామ నరసింహరావు,ఆనంద్ 92 దస్తావేజులకు ఈ–సైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. కాగా, సర్వర్ సమస్యతో రాత్రి 8 గంటల వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.
● డ్రెయినేజీలో పడి హమాలీ మృతి
● దేవరుప్పులలో ఘటన