
వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి
కేసముద్రం: వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. బుధవారం కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని కోరుకొండపల్లి, ధన్నసరి గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. అనంతరం రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రోగ్రాం అధికారి సారంగం, సుధీ ర్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ నంబీకిషోర్, ప్రసాద్ ఉన్నారు.
డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్