
సైన్స్‌కాంగ్రెస్..
యంగ్ సైంటిస్ట్‌లతో ముఖాముఖి
కేన్సర్‌పై అవగాహన ఉండాలి
డీఆర్‌డీఓలో పరిశోధనలకు
అవకాశం
‘ఎల్‌టీటీ’లో సాంకేతిక లోపం..
ఉత్సాహంగా
కొనసాగుతున్న
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఉత్సాహంగా రెండు రోజు బుధవారం కొనసాగింది. ‘ఇన్నోవేటివ్ స్కిల్స్ ఫర్ ఎంపవర్‌మెంట్ సైన్స్‌అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్సాఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై కొనసాగుతోంది.
ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిట్లు..
శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడంలో భాగంగా హైస్కూల్ స్థాయి విద్యార్థులను తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌కు తీసుకొచ్చారు. ఆడిటోరియం వద్ద వివి ధ హైస్కూళ్ల విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించగా ఆకట్టుకున్నాయి.
దృష్టికోణం మార్చే జీవనశైలి..
హైదరాబాద్ ఐఐసీటీ ప్రొఫెసర్ వర్దిరెడ్డి మనోరమ ‘ఎ సోజోమ్ ది బకేమ్ ఏ వే ఆఫ్ లైఫ్’ అనే అంశంపై మాట్లాడుతూ ఒక వ్యక్తి లేదా సమూహం తా త్కాలికంగా ప్రారంభించిన జీవన ప్రయాణం.. క్రమంగా వారి జీవిత విధానంగా మారిన విశేషకథనాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ప్రయాణం సాంస్కృతిక మార్పుల వైపు దారితీసిన మార్గాన్ని వివరిస్తుందన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
ఆడిటోరియంలో బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ సాంప్రదాయ, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాగా, బుధవారం మొత్తం ఇన్‌వైటెడ్ లెక్చర్లు 23, ఓరాల్ ప్రజెంటేషన్లు 58, పోస్టర్ ప్రజెంటేషన్లు 40 జరిగాయి.
నేడు ముగింపు సభ
గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సైన్స్‌కాంగ్రెస్ ముగింపు సభ నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. ముఖ్యఅతిథులుగా కడప యోగివేమన యూనివర్సిటీ మాజీ వీసీ ఎ. రామచంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తదితరులు పాల్గొంటారని తెలిపారు.
సమగ్రాభివృద్ధి లక్ష్యాలకు దోహదం..
సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌తో ఆకలి నిర్మూలన, ఆరోగ్యం, బాధ్యతాయుత ఉత్పత్తి, సమగ్రాభివృద్ధి లక్ష్యాలు సాధ్యమని హైదరాబాద్ జేఎన్‌టీయూ బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఉమ అన్నారు. రైస్‌లో జీనోమ్ ఎడిటింగ్ భవిష్యత్‌లో అధిక దిగుబడి వస్తుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్‌కు చెందిన సతేంద్రకె మంగ్రోథియా అన్నారు. స్వయం నియంత్రిత రక్షణ వ్యవస్థలో జాతీయ భద్రత, ఆర్థిక దృఢత్వం, గ్లోబల్ కనెక్టివిటీ కీలకమని ఇస్రో మాజీ డైరెక్టర్ పిచ్చైమణి అన్నారు. డాక్టర్ కిరణ్ కిశోర్ ‘ఎర్త్ అబ్జర్వేషన్ టూప్లానటరీ ఎక్స్‌ఫ్లోరేషన్ ఎ రిజిమ్ షిప్ట్ ఇన్‌స్పేస్ ప్రోగ్రామ్స్’ అనే అంశంపై మాట్లాడారు.
సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా సెనేట్ హాల్‌లో విద్యార్థులకు యంగ్‌సైంటిస్ట్‌ల మీట్ నిర్వహించారు. యంగ్‌సైంటిస్ట్ అవార్డు పొందిన రామచంద్రరావు ఎల్లా.. క్వాంటం కంప్యూటింగ్‌పై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. హైదరాబాద్ ఎన్‌జీఆర్ శాస్త్రవేత్త హర్షిత్‌రెడ్డి గంగుల అరుదైన భూకమతాల గురించి వివరించారు. వరంగల్ కేఎంసీ సైంటిస్ట్ బి.ఫణికాంత్ జోగం ప్రొటిన్ మార్పిడిపై సందేహాలను నివృత్తి చేశారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ బాధ్యులు సంజీవరెడ్డి, వడ్డె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ అధ్యక్షుడు మో హన్‌రావు, జనరల్‌సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ ఎస్‌ఎం రెడ్డి, జాయింట్ సెక్రటరీ వడె ్డరవీందర్, కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, తది తరులు విద్యార్థులను అభినందించారు.
ఇంటికన్నె రైల్వేస్టేషన్‌లో 2గంటలు నిలిపివేత
కేసముద్రం: ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతికలోపంతో విశాఖపట్నం–ముంబాయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్‌లో 2 గంటలు నిలిచింది. ముంబాయి వైపుకు బయలుదేరిన ఎల్‌టీటీ రైలు ఇంటికన్నె రైల్వేస్టేషన్ వద్ద ఉదయం 10 గంటల సమయంలో నిలిచింది. దీంతో చింతలపల్లి నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంజిన్ తీసుకొచ్చి నిలిచిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు అటాచ్డ్ చేశారు. అనంతరం 12 గంటల ప్రాంతంలో ఎల్‌టీటీని యథావిధిగా పంపించారు. సుమారు 2 గంటల పాటు ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ నిలవడంతో మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో వందేభారత్ అర్ధగంట, గోల్కోండ ఎక్స్‌ప్రెస్ గంట, కేసముద్రంలో అర్ధగంట నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిట్లు
ఉమెన్స్, యంగ్ సైంటిస్ట్‌ల మీట్
సెనేట్‌హాల్‌లో ఉమెన్స్ సైంటిస్ట్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ ఎల్‌వీ ప్రసాద్ నేత్రవైద్యశాల ప్రొఫెసర్ గీతాకె వేముగంటి.. కేన్సర్ పురోగతిలో చిన్న ఎక్స్‌ట్రాసియిలర్ వేసికుల్స్ పాత్రపై వివరించారు. ఈవేసికుల్స్ ఇమ్యూన్ సిస్టమ్‌ను తప్పించుకునేలా పనిచేసి కేన్సర్ సెల్స్ రక్షణ పొందేలా చేస్తాయన్నారు. కేన్సర్‌పై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు.
డీఆర్‌డీఓ సైంటిస్ట్ టి. వెంకటమణి డీఆర్‌డీఓ సైన్స్‌అండ్‌టెక్నాలజీపరంగా జరుగుతున్న పరిశోధనల గురించి వివరించారు. నైపుణ్యాలు, ప్రతిభకలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు డీఆర్‌డీఓ పరిశోధకులుగా అవకాశం కల్పిస్తామని తెలిపారు.

సైన్స్‌కాంగ్రెస్..

సైన్స్‌కాంగ్రెస్..