
రైల్వే భద్రతపై ప్రత్యేక దృష్టి
● దక్షిణ మధ్య రైల్వే కన్‌స్ట్రక్షన్ చీఫ్
ఇంజనీర్ సునీల్ కుమార్ వర్మ
మహబూబాబాద్ రూరల్ : దక్షిణ మధ్య రైల్వే భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తుందని దక్షిణ మధ్య రైల్వే కన్‌స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ సునీల్ కుమార్ వర్మ అన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణ పనులను రైల్వే ఉన్నతాధికారులు బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రైల్వే మూడో లైన్ నిర్మాణం పనుల్లో పర్యవేక్షణ లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించామన్నారు. రైల్వే మూడో లైన్ నిర్మాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. తనిఖీల్లో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కన్ స్ట్రక్షన్ శ్రీనివాస్, ఏఎక్స్‌ఈఎన్ కన్‌స్ట్రక్షన్ గంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.