
పరీక్షలు.. పది లక్షలు
టీ హబ్‌లో చేపట్టిన
టెస్టులు వివరాలు
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన టీ డయాగ్నొస్టిక్ సెంటర్ల ద్వారా ఆశించిన మేరకు సేవలు అందుతున్నాయి. జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి తీసుకువచ్చే రక్త నమూనాలను పరీక్షించి ఫలితాలు వెల్లడిస్తున్నారు. 134 రకాల పరీక్షలు చేయడం ద్వారా రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. కాగా 2021లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 10లక్షలకు పైగానే పరీక్షలు చేసి ఫలితాలను వెల్లడించినట్లు అధికారులు తెలుపుతున్నారు.
ప్రతీరోజు 1,500 పైగానే..
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు 21 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీలు, బస్తీదవాఖానల నుంచి రక్త నమూనాలు టీ హబ్‌కు వస్తుంటాయి. ప్రతీరోజు 1,500పైగా రక్త నమూనాలను పరీక్షించి ఫలితాలు పంపిస్తున్నారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలు పెరుగుతుండడంతో పరీక్షలు పెరుగుతున్నాయి. కచ్చితమైన పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాలను ఆరు గంటల్లోపే అందజేస్తున్నారు. కాగా, ఫలితాల వెల్లడితో మానుకోట టీ డయాగ్నొస్టిక్ సెంటర్ రాష్ట్రంలో ముందంజలో ఉంది.
ప్రత్యేక వాహనాల్లో..
పలు ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి రక్త నమూనాలను జిల్లా కేంద్రంలోని టీ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు తరలిస్తారు. శాంపిళ్లను ప్రత్యేక డబ్బాల్లో భద్రపరిచి వాహనాల్లో తరలిస్తున్నారు. రోగుల ఆధార్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఫలితాలను రోగుల మొబైల్‌కు మెసేజ్ పంపిస్తున్నారు. ప్రభుత్వ సేవల ద్వారా ఒక్కో రోగికి సుమారు రూ.2 నుంచి రూ.3 వేల వరకు డబ్బు ఆదా అవుతోంది.
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో అవసరమైన ప్రతీ ఒక్కరికి ఉచితంగా టీ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. జీజీహెచ్‌తో పాటు పీహెచ్‌సీ రక్త నమూనాలు కూడా సెంటర్‌కు వస్తున్నాయి. రక్త నమూనాలను పరీక్షించి కచ్చితమైన ఫలితాలు వెల్లడిస్తాం. ఉచితంగా అందిస్తున్న సేవలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాసరావు,
జీజీహెచ్, సూపరింటెండెంట్
టీ డయాగ్నొస్టిక్
సెంటర్‌లో రక్త పరీక్షలు
అందుబాటులోకి 134 వైద్య పరీక్షలు
రోగులకు కచ్చితమైన వ్యాధి నిర్ధారణ
పది లక్షల పరీక్షల మార్కు దాటిన
డయాగ్నొస్టిక్ సెంటర్
నెల టెస్టులు
జూన్ 30,968
జూలై 39,878
ఆగష్టు(20 వరకు) 22,527

పరీక్షలు.. పది లక్షలు