ప్రభుత్వం మొద్దునిద్ర వీడి యూరియా అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మొద్దునిద్ర వీడి యూరియా అందించాలి

Aug 21 2025 7:00 AM | Updated on Aug 21 2025 7:00 AM

ప్రభు

ప్రభుత్వం మొద్దునిద్ర వీడి యూరియా అందించాలి

నెల్లికుదురు: ప్రభుత్వం మొద్దు నిద్రవీడి రైతులకు యూరియా అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో రైతులకు యూరియా అందించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. రైతులు యూరియా బస్తాలకోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, పంటలకాలం దాటిపోతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మె ల్యే, ఎంపీ, కలెక్టర్‌ స్పందించి రైతుల పంటల కు సరిపడా యూరియా అందించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు.

అధికారుల

కాళ్లు పట్టుకున్న రైతు!

యూరియా బస్తాలు

ఇవ్వాలని వేడుకోలు

తొర్రూరు: రైతులకు యూరియా కష్టాలు తప్ప డం లేదు. రైతులు కాళ్లు పట్టుకుని వేడుకున్నా అధికారులు కనికరించడం లేదు. యూరియా కోసం బుధవారం తొర్రూరులోని పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట రైతులు బారులుదీరారు. ఒక్కో ఆధార్‌ కార్డుపై రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా బస్తాల కోసం రైతులు స్థానిక పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట ఉదయం 5 గంటల నుంచే వేచి ఉన్నారు. యూరియా కొరతతో రెండు ఎకరాలున్న రైతులకు ఒకే బస్తా కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు అధికారి కాళ్లు మొక్కి యూరియా బస్తాలు ఇవ్వాలని వేడుకున్నాడు. తొర్రూరు ఆర్డీఓ గణేష్‌, డీఎస్పీ కృష్ణకిషోర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఏఓ రాంనర్సయ్యలు పీఏసీఎస్‌కు చేరుకుని రైతులతో మాట్లాడి సంయమనం పాటించాలని కోరారు. తొర్రూరులో రైతు అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకోవడంపై బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పందించారు. ‘కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయని, రైతులు యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి దాపురించింది. ఇది అత్యంత బాధాకరం’ అని హరీష్‌రావు ‘ఎక్స్‌’లో అన్నారు.

రోగులకు మెరుగైన

వైద్యసేవలు అందించాలి

గార్ల: మండలంలోని సీహెచ్‌సీకి వచ్చే రోగులకు వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌ సూచించారు. బుధవారం సీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఆస్పత్రి లోని వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరి శీలి ంచారు. ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని రోగుల ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్య మైన వైద్యసేవలు అందించాలన్నారు. సిబ్బంది విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ, సమయపాలన పాటించాలన్నారు. సూపరింటెండెంట్‌ శ్రీధర్‌గౌడ్‌, డాక్టర్లు బాలునాయక్‌, రాజ్‌కుమార్‌ జాదవ్‌, హనుమంతరావు ఉన్నారు.

ప్రభుత్వం మొద్దునిద్ర వీడి  యూరియా అందించాలి1
1/1

ప్రభుత్వం మొద్దునిద్ర వీడి యూరియా అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement