ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం

Aug 20 2025 5:09 AM | Updated on Aug 20 2025 5:09 AM

ఆవిష్

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం

సెరికల్చర్‌ విద్యార్థుల ప్రదర్శన

కేయూ క్యాంపస్‌: విద్యార్థులు, యువత ఆవిష్కరణలు దేశానికి ఆదర్శమని డీఆర్డీఓ మాజీ చైర్మన్‌, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్‌ సతీష్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం సందర్భంగా తెలంగాణ అకాడమీ సైన్సెస్‌, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్‌ మంగళవారం క్యాంపస్‌లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్‌ స్కిల్స్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ థీమ్‌తో సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహండం అభినందనీయమన్నారు. ప్రతి రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం, ఎఐఎంఎస్‌, నిట్స్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు ఉండడం వల్ల అనేకమంది విద్యార్థులు ఆవిష్కరణలు, పరిశోధనాపత్రాల ప్రచురణలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం 75శాతం విద్యార్థులు విదేశాలనుంచి తిరిగి వచ్చి మాతృభూమిలో ఆవిష్కరణలు చేస్తున్నారన్నారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన 90శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. తమ గ్రామం నుంచి తానొక్కడే ఇంజనీరింగ్‌ పూర్తి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్ర స్తుతం 1.75మిలియన్‌ స్టార్టప్స్‌ వచ్చాయన్నారు. ఏ గ్రామం, ఏ కుటుంబం నుంచి వచ్చామనేది ము ఖ్యంకాదని ఏ ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తున్నామన్నదే ముఖ్యమన్నారు. యువత మైండ్‌సెట్‌ మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ సాంకేతికతతో పోటిపడే మనస్తత్వం రావాలన్నారు.

యువతకు ఆలోచనలే కీలకం

డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ

సలహాదారు సతీష్‌రెడ్డి

కేయూలో తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభం

కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియం వద్ద సెరికల్చర్‌ విద్యార్థుల పట్టుపురుగుల ప్రదర్శన ఆకట్టుకుంది. డాక్టర్‌ సుజాత విశిష్టతను వివరించారు. మల్బరీ నాన్‌మల్బరీ గూడిపట్టు చీలుకులపై బోధన, పెంపకం, పరిశోధనపై నిర్వహించే అంశాలపై వివరించారు. ఇదిలా ఉండగా.. సెనెట్‌హాల్‌లో విద్యార్థులు, సైంటిస్టులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, విజ్ఞాన్‌ప్రసాద్‌, రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్‌గా ఆచార్య జ్యోతి పాల్గొన్నారు.

టీబీ నియంత్రణకు నూతన ఔషధాలు

టీబీ నియంత్రణకు నూతన ఔషధాల అభివృద్ధి తప్పనిసరి అని హైదరాబాద్‌ సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ కె నందుకూరి వెల్లడించారు. తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్‌లో ‘టీబీ మెకానిస్టిక్‌ ఇన్‌సైట్స్‌ ఇన్‌ టూ హౌది పాజిటివ్‌ పాథోజెన్‌ సర్వైవ్స్‌ ఇన్‌ది హోస్ట్‌’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ట్యూబర్కులోసిస్‌కు కారణమైన మైక్రోబాక్టీరియం ట్యూబర్కులోసిస్‌ (ఎంటీబీ)లో ఔషధ నిరోధకత పెరుగుతుందన్నారు.

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం1
1/3

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం2
2/3

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం3
3/3

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement