
కాళేశ్వరంలో వరద ఉధృతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.680మీటర్ల ఎత్తులో నీటిమట్టం పెరిగి దిగువకు తరలిపోతుంది. ఎగువన కడెం, ఎల్లంపల్లినుంచి గోదావరి మీదుగా అన్నారం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 1.21లక్షల క్యూసెక్కులను 66 గేట్లు ఎత్తి దిగువకు కాళేశ్వరం వైపుకు తరలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 6.65లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఎగువ గోదావరి, ప్రాణహిత నదుల గుండా తరలి వస్తుంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఔట్‌ఫ్లో రూపంలో తరలిస్తున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కాటారం: పంట సాగు కోసం అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే వర్షాలకు పంట సరిగా లేదని పెట్టుబడి తిరిగి చేతికి రాదనే మనోవేదనతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్‌లో చోటు చేసుకుంది. బాధిత కు టుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. బొల్లి బాపు(38), దేవక్క దంపతులు తమ ఎకరం భూమిలో వ్యవసాయం, ఇతరులకు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది బాపు తన ఎకరం భూమిలో పత్తి పంట సాగు చేసి రూ.70 వేలు పెట్టుబడి కోసం అప్పు చేశాడు. వర్షా ల కారణంగా పత్తి పంట దెబ్బతిన్నది. దీంతో పెట్టుబడి చేతికి రాలేని పరిస్థితి ఉందని బాపు తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బాపు వ్యవసా య పనుల నిమిత్తం రూ.1.20 లక్షలు పెట్టి ఎద్దుల ను కొనుగోలు చేయగా రూ.40 వేలు చెల్లించి మిగి తా రూ.80 వేలకు సదరు యజమానిని సమయం కోరాడు. సోమవారం ఎద్దులు విక్రయించిన వ్యక్తి తనకు డబ్బులు అత్యవసరమని ఇంటికి రాగా పది రోజులకు ఇస్తానని చెప్పి పంపించాడు. ఈనేపథ్యంలో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు రూ.70 వేలు, ఎద్దుల బాకీ రూ.80 వేలు చెల్లించే దారిలేకపోవడంతో తీవ్రమనోవేదనతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య దేవక్క గమనించి కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి బాపును చికిత్స నిమిత్తం భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాపు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు పిల్లలు గ్రీష్మా, రిషివర్ధన్, అఖిల్ ఉన్నారు. దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఒంటరి జీవితం గడపలేక..
గార్ల: 10 ఏళ్ల క్రితం తండ్రి, 2 ఏళ్ల క్రితం తల్లి మృతి చెందడంతో మనోవేదనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మానుకోట జిల్లా గార్ల మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పినిరెడ్డిగూడేనికి చెందిన గుగులోత్ మేఘన (17) హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతుంది. రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన యువతి అమ్మనాన్న చనిపోవడంతో మానసికంగా కృంగిపోయింది. అన్నతోపాటు, బాబాయి కుమారులకు రాఖీ కట్టిన అనంతరం ఇంటికి చేరిన ఆమె తన ఆలనాపాలనా చూసుకునే తల్లిదండ్రులు లేరని బాధపడుతూ బాత్‌రూమ్ క్లీనర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన బంధువులు బైక్‌పై గార్ల సీహెచ్‌సీకి తీసుకొచ్చి ప్రథమచికిత్స అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి సైలెన్‌తోనే బైక్‌పై తీసుకెళ్తుండగా మార్గమధ్యలో వచ్చిన 108 అంబులెన్స్‌లో తరలించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. మేఘన సోదరుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రియాజ్‌పాషా వెల్లడించారు.
● యువతి ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూ మృతి

కాళేశ్వరంలో వరద ఉధృతి

కాళేశ్వరంలో వరద ఉధృతి

కాళేశ్వరంలో వరద ఉధృతి