
విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
నెహ్రూసెంటర్: సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా, టైపాయిడ్, చికెన్‌గున్యా వంటి విష జ్వరాలు ప్రభలే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ సూచించారు. సోమవారం ఆయన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు అందించే ఆహారం రుచికరంగా ఉండాలని తెలిపారు. ఆస్పత్రిలో అత్యవసర సేవలతోపాటు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్, అన్ని విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ జగదీశ్ ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్