
జాతీయ విపత్తులపై విద్యార్థులకు అవగాహన
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ విపత్తులపై విద్యార్థులకు ఎన్డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో పదో బెటాలియన్ టీం కమాండ్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. భూకంపాలు, రైలు ప్రమాదాలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం జరగకుండా ప్రమాదబారిన పడిన వారిని రక్షించాలని, పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక దళం వంటి వివిధ అత్యవసర సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆకస్మాత్తుగా మంటలు, వరదలు, అగ్ని, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండి బాధితులకు సాయం అందించాలని తెలిపారు. లేదంటే 100, 108, 101, ఫైర్ ఇతర నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లక్ష్మణ్‌నాయక్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.