
సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం
మహబూబాబాద్: సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్‌టొప్పో అన్నారు. సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో సోమవారం అధికారికంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. గొప్ప పోరాటయోధుడు సర్దాయి సర్వాయి పాపన్న అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించి ఆదర్శంగా నిలిచిన మహోన్నతవ్యక్తి అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో