
పర్యాటకంలో ములుగును
ప్రథమ స్థానంలో నిలుపుతా
ములుగు రూరల్: పర్యాటక రంగంలో ములుగు జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఇంచర్ల నిర్మిస్తున్న ఎకో ఎత్నిక్ విలేజ్, పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామప్ప, లక్నవరం అభివృద్ధితో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఇతర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రామప్ప, లక్నవరం, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర, బొగత జలపాతం, బ్లాక్ బెర్రీ, దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. జాతీయ రహదారికి సమీపంలో రూ. 37 కోట్లతో పర్యాటక స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, హ్యాపీ థియేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. రామప్పలో రూ. 13 కోట్లతో ఐలాండ్ పనులు చేపడుతామన్నారు. అనంతరం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ ములుగు జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, గ్రంథాల య సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, టూరిజంశాఖ అధికారి శివాజీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
క్రెంచ్ కేంద్రంలో పిల్లలకు సంరక్షణ..
క్రెంచ్ కేంద్రంలో పిల్లలకు సంరక్షణ ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని జగ్గన్నపేటలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి అంగన్ వాడీ, డే కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క