
మేడిగడ్డకు కొనసాగుతున్న వరద
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరి, ప్రాణహిత నదుల వరద కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తుండడంతో వరద నిలకడగా ఉంది. కాళేశ్వరం త్రివేణి సంగమం 8.540 మీటర్ల ఎత్తులో నీటిమట్టం తరలుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 4.70లక్షల క్యూసెక్కులు తరలివస్తోంది. దీంతో అదే స్థాయిలో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తినీటిని దిగువకు వదులుతున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద